Rashmika Mandanna: అలాంటి వారికి శిక్ష విధించాలి’ – హీరోయిన్ కఠిన హెచ్చరిక!”

Spread the love
Rashmika Mandanna
Image Credit: Goodfon

(Rashmika Mandanna ) : ఈ ఇంటర్నెట్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రారంభమైనప్పటి నుండి దాని వాడకం భారీగా పెరిగింది. ఈ అద్భుతమైన సాంకేతికతను అభివృద్ధికి ఉపయోగించాల్సిన పోయి, కొందరు మాత్రం దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పేరు పొందుతున్న సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఇటీవల రష్మిక మందన్న కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. ఆమెపై మార్ఫింగ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విధంగా కీర్తి సురేష్, గిరిజ, పౌల్ వంటి పలువురు నటీమణుల పేరుతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి, వారి ముఖాలను తప్పుగా మార్ఫింగ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళలపై గౌరవం లేకుండా ఇలాంటి అసభ్య ప్రవర్తన జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

ఈ విషయం మీద రష్మిక మందన్న తీవ్రంగా స్పందించారు.
ఆమె చెప్పింది:

“అభివృద్ధికి వాడితే AI మన దేశానికి ఎంతో వరంగా ఉంటది. కానీ ఇలాంటి పనులకు వాడితే శాపంగా మారుతుంది తప్ప. ఎవరైతే మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వీడియోలు లేదా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారో, వారిపై కఠినంగా శిక్షలు విధించాలి.”

రష్మిక తనకు జరిగిన విషయాలను తన ఎక్స్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేస్తూ సైబర్ దోస్త్‌ను ట్యాగ్ చేశారు. ఇలాంటి సమస్యలను గౌరవప్రదంగా పరిష్కరించాలని, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగాన్ని కోరారు.

Read : హీరో రామ్ వాయిస్‌తో Andhra King Taluka సాంగ్ ఫుల్ వీడియో అవుట్ – ఎనర్జీ పర్ఫార్మెన్స్ వైరల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *